మాచాపూర్‌లో ఈ దంపతులు సర్పంచ్‌లు
NZB: ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన కర్రె యాదమణి, కర్రె నారగౌడ్ దంపతులు వరుసగా సర్పంచ్‌లుగా పనిచేశారు. 2006లో యాదమణి ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, 2013లో ఆమె భర్త నారగౌడ్ సర్పంచిగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో కూడా నారగౌడ్ ఒక పార్టీ మద్దతుతో బరిలో నిలిచారు.