చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలో అగ్నిప్రమాదం
ప్రకాశం: తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామ సమీపంలోని చెన్నకేశవ నరవ మీద వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిసర ప్రాంతాలలో ఎండిన గడ్డి ఉండడంతో నిప్పు అంటుకొని మంటలు ఎగిసిపడ్డాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మార్కాపురం అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.