అంజాద్ అలీకి కాంగ్రెస్ కీలక బాధ్యతలు
WNP: మదనాపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజాద్ అలీకి పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సహకారంతో ఆయన్‌ను నాగర్కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ అబ్జర్వర్‌గా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యేకు అంజాద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.