పురుగుమందు నీరు తాగి గేదె మృతి

పురుగుమందు నీరు తాగి గేదె మృతి

MLG: వెంకటాపురంలో పురుగుల మందు నీరు తాగి గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం గోదావరి లంకలో పంట పొలంలో వదిలేసిన పురుగుమందు డ్రమ్ములోని నీరు తాగి గేదె అక్కడికక్కడే చనిపోయింది. సుమారు రూ. 60 వేల విలువైన గేదె మృతి చెందినట్లు యజమాని వాపోయాడు. పురుగు మందు అవశేషాలను సురక్షితంగా నిర్వీర్యం చేయాలని పశువుల యజమానులు కోరుతున్నారు.