VIDEO: ద్విచక్ర వాహనాలను వేగంగా ఢీకొట్టిన కారు

VIDEO: ద్విచక్ర వాహనాలను వేగంగా ఢీకొట్టిన కారు

KKD: కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కు వద్ద ఆదివారం ఉదయం వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. కారు నడుపుతున్నది మైనర్లేనని, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.