'అనాథ పిల్లల గుర్తింపుకు కమిటీలు వేయాలి'

'అనాథ పిల్లల గుర్తింపుకు కమిటీలు వేయాలి'

NRPT: జిల్లాలో అనాథ పిల్లలు, బడి మానేసిన పిల్లలను గుర్తించేందుకు కమిటీ వేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్ లైన్, విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆశ వర్కర్లు, అంగన్వాడి సిబ్బందితో కమిటీ వేసి అనాథ పిల్లను గుర్తించి విజన్ సంస్థ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు.