ఎమ్మార్పీ రేట్లకు మించి విక్రయాలు జరిపితే చర్యలు

AKP: నాతవరం మండల ప్రత్యేకాధికారి జీ.మంగవేణి శనివారం మండల పరిషత్ కార్యాలయంలో రైతు సేవా కేంద్రాల ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. తమ రైతు సేవా కేంద్రం పరిధిలో వరి ఊడ్చిన విస్తీర్ణం, కావలసిన యూరియా వివరాలను ప్రతీ రోజు మండల లెవెల్ టీమ్‌కు ఇవ్వాలని చెప్పారు. యూరియా సరఫరాలో లోపాలున్న, ఎమ్మార్పీ రేటుకు మించి విక్రయాలు జరిపినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.