ఆంజనేయ స్వామి ఆలయ గోడ ధ్వంసం
ఖమ్మం: కామేపల్లి మండల పరిధిలోని బండిపాడు స్టేజీ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి గుర్తు తెలియని వాహనం రూపంలో ముప్పు వాటిల్లింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ వాహనం ఆలయ ప్రహరీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడ ఒకవైపు పూర్తిగా కూలిపోయి ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే సదరు వాహనదారుడు ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.