తిరుమల ఘాట్ రోడ్లో మృతదేహం కలకలం
TPT: తిరుమల డౌన్ ఘాట్ రోడ్లో 8-9వ టర్నింగ్ల మధ్య డీకంపోజ్డ్ స్థితిలో మృతదేహం లభ్యమైంది. సుమారు 8 నుంచి10 రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని సుమన్ (39), కేజీఎఫ్, కర్ణా టకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన తిరుపతిలో ఉంటూ సెలూన్లో పనిచేసేవాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.