లక్ష రూపాయలకు లడ్డు పాడుకున్న భక్తుడు
కృష్ణా: గుడివాడ నియోజకవర్గం పెద్దఎరుకపాడు గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం వద్ద వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం, స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించగా, పోతుల శ్రీకాంత్ రూ. 1,01,001లకు దక్కించుకున్నారు. పెదఎరుకపాడు గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పోతుల శ్రీకాంత్‌ను అభినందించారు.