టాస్‌తో తేలిన సర్పంచ్ ఎన్నిక ఫలితం
TG: ఖమ్మం(D) కూసుమంచి(M) చేగొమ్మలో టాస్‌తో సర్పంచ్ ఫలితం తేల్చారు. BRS, కాంగ్రెస్ మద్దతుదారులకు 947 చొప్పున ఓట్లు సమానంగా రావడంతో అధికారులు ఫలితం కోసం టాస్ వేశారు. BRS బలపర్చిన అభ్యర్థి బత్తుల వీరస్వామిని విజయం వరించింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, తాము తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమని అధికారులు తేల్చి చెప్పారు.