జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్
KRNL: జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి సమస్యలు ఉంటే 1,967 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా హోటళ్లలో అనధికారంగా వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.