పెదవడ్లపూడిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
GNTR: మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.3,35,366 విలువైన చెక్కులను గురువారం పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బాధితుల ఇళ్లకు వెళ్లి ఎల్‌వోసీ చెక్కులను అందజేశారు. చెక్కులను మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అందించారు.