స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ సమీక్ష

SRD: ఈనెల 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులలో నిర్వహించే వేడుకలపై అధికారులకు సూచనలు చేశారు.