అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను పలకరించారు. పౌష్టికాహారం కోసం నిలువ చేసిన వస్తువులను పరిశీలించారు. చిన్నారులు అమితంగా ఇష్టపడే పదార్థాలను గ్రహించి వాటిని అందచేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.