VIDEO: శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రభుత్వ విప్

VIDEO: శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రభుత్వ విప్

ATP: రాయదుర్గం పట్టణం తాహసీల్దార్ కార్యాలయం రోడ్డులో ఉన్న శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. స్వామి ఉత్సవ మూర్తిని రథోత్సవంపై కొలువు తీర్చి వినాయక సర్కిల్ లక్ష్మీ బజార్ మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో చిన్నారుల చెక్కభజన నృత్యం అందర్నీ ఆకట్టుకుంది. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు.