'భూగర్భ జల మట్టాలను పెంచడమే ధ్యేయం'
ASR: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచడమే ధ్యేయంగా చేపట్టిన 'జలధర-జల హారతి' 100రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ నిషాంతి గురువారం అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల సమన్వయంతో నీటి నిల్వ కట్టడాల నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెక్ డ్యామ్లు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ కట్టడాల డిజైన్లను త్వరితగతిన రూపొందించాలన్నారు.