VIDEO: పొంగిపొర్లుతున్న గుండ్ల సింగారం ప్రాజెక్ట్

SRPT: నూతనకల్ మండలం గుండ్లసింగారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి గుండ్ల సింగారం ప్రాజెక్టు వద్ద బుధవారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు నుండి నీరు కిందకు జాలువారుతుండగా, పిల్లలు, పెద్దలు ఆ జలపాతం అందాలను చూస్తూ ఆనందిస్తున్నారు. చాలామంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.