బంగారు పద్మాలతో వెంకన్నకు పూజ

బంగారు పద్మాలతో వెంకన్నకు పూజ

BHPL: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి బంగారు పద్మాలతో అష్టదళ పాద పద్మారాధన పూజను ఆలయ అర్చకులు అత్యంత భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారు ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శణమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.