మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. తీవ్ర పంట నష్టం

KRNL: జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2,500 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. పత్తి, కంది, వేరుశనగ,ఉల్లి వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 700 హెక్టార్లలోనే నష్టం జరిగినట్లు తెలుస్తోందని రైతులు చేపుతున్నారు. ఆదివారం ఆదోనిలో 49.8 M.M, కృష్ణగిరిలో 26M.M, పెద్దకడుబూరులో 25.4 M.M వర్షపాతం నమోదైంది.