PHCని తనిఖీ చేసిన ఎంపీడీవో

SRD: కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో సత్తయ్య మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు స్థానిక వైద్యాధికారి డా.నాగమణి, ఆయుష్ డా.నారాయణరావు అందుబాటులో ఉండగా వారితో మాట్లాడి ఆస్పత్రి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓపి రోగుల సంఖ్య, వైద్య చికిత్సలపై ఆరా తీశారు. ఈ నెలలో నిన్నటి వరకు 15 ప్రసవాలు జరిగినట్లు డాక్టర్ తెలిపారు.