'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

GNTR: అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మంగళగిరి పరిధిలోని కాజ సచివాలయం వద్ద రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుంటూరు ఛానల్‌కు గండి పడిందని, పంటలు నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు.