కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు మంజూరు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సైన్స్ కళాశాలలో నూతనంగా బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు మంజూరైనట్లు ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులోకి రావడం విద్యార్థులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. BPC, MLT పూర్తి చేసిన అభ్యర్థులు దోస్త్ (DOST) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.