ఇద్దరికీ నియామక పత్రాలు పంపిణీ చేసిన కలెక్టర్

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, కారుణ్య నియామక కోటాలో ఉద్యోగం పొందిన ఇద్దరికి నియామక పత్రాలను అందజేశారు. పశుసంవర్థక శాఖ, కార్మిక శాఖలలో వీరికి ఉద్యోగాలు కల్పించారు. విధుల నిర్వహణలో వృత్తి నైపుణ్యంను పెంచుకొని సంబంధిత శాఖలకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.