విద్యార్థుల దాహం తీర్చిన పూర్వ విద్యార్థులు
GDWL: గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థుల త్రాగునీటి సమస్యను ఆ కళాశాల పూర్వ విద్యార్థులు (గద్వాల్ రవీంద్ర ఉన్నత పాఠశాల 1988-89 టెన్త్ క్లాస్ బ్యాచ్) పరిష్కరించారు. తమ మిత్రులు వీర శేఖర్ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని పూర్వ విద్యార్థులు బుధవారం కళాశాలకు అందించారు. స్నేహితులను గుర్తుపెట్టుకుని సాయం చేయడం పట్ల కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.