పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీడీవో

ASF: సిర్పూర్ (యూ) మండల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో కృష్ణారావు సూచించారు. మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన వీధుల్లో క్లోరినేషన్ బ్లీచింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం నీరు నిలువ ఉన్నచోట దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామన్నారు. చెత్త పేరుకుపోయి ఉన్న చోట చెత్తను సిబ్బందితో తొలగించినట్లు పేర్కొన్నారు.