మండలంలో రేపే ఎన్నికలు
KNR: ఇల్లందకుంట మండలంలో 20 స్థానాలకు సర్పంచ్ ఎన్నికలను అధికారులు బుధవారం నిర్వహిస్తున్నారు. మండలంలో 20 సర్పంచ్ స్థానాలకు 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు స్థానాలు 188 ఉండగా 33 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 155 స్థానాలలో 428 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మండలంలో మొత్తం 28,929 మంది ఓటర్లు ఉన్నారు.