11న ‘సర్’ పిటిషన్లపై సుప్రీం విచారణ
ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల నుంచి పిటిషన్లు దాఖలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాటిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ నెల 11న పిటిషనర్ల వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.