CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ
సత్యసాయి: పెనుకొండ మండలంలోని ఎంపీ కార్యాలయంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి లబ్ధిదారులకు మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 16 మందికి రూ. 16,69,189 లక్షలు సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు CMRF చెక్కులు వరంలా పని చేస్తున్నాయని తెలిపారు.