సైబర్ నేరాలకు గురైతే 1930కు కాల్ చేయండి: ఎస్పీ

NRML: సైబర్ స్లేవరీ పేరుతో ఉద్యోగాల ఆశ చూపి మోసాలు జరుగుతున్నాయని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రజలను హెచ్చరించారు. మంగళవారం జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆన్ లైన్ మోసాలకు గురైన వారు వెంటనే 1930కు కాల్ చేసి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.