'ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా మహిళా కార్మికులకు అవకాశం'
BDK: సింగరేణిలో ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా మహిళా కార్మికులకు అవకాశం కల్పించాలన్న సీఎండీ శ్రీ ఎన్. బలరామ్ ఆలోచన మేరకు సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం తొలిసారిగా ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఇటీవలనే దరఖాస్తులకు ప్రకటన చేశారు.