కలిసి రాని ఉగాది.. తగ్గిన కొబ్బరి ధరలు

కలిసి రాని ఉగాది.. తగ్గిన కొబ్బరి ధరలు

కోనసీమ: జిల్లాలో కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఉగాది సీజన్‌పై ఆశలతో వ్యాపారులు కాయను రూ.21-22కు కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఆ ధర రూ.14కు పడిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోవడమే ఈ కుంగుబాటుకు కారణమని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. పెట్టుబడి కూడా రాక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.