జిల్లా పరిషత్ హై స్కూల్ తనిఖీ చేసిన జేసీ

W.G: ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్‌ను బుధవారం జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. స్కూల్ ఆవరణ అంతా తిరిగి పర్యవేక్షించారు. విద్యార్థులు అమ్మ పేరుతో నాటేందుకు సిద్ధపరిచిన మొక్కలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పథకంలో తయారు చేసే వంటశాలకు వెళ్లి వండిన వంటకాలను, స్టాక్ రూములో ఉన్న స్టాకును తనిఖీ చేశారు.