స్మశాన వాటికలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
AKP: దేవరాపల్లి మండలం నాగయ్యపేట పంచాయతీ శివారు సీతంపేట స్మశాన భూమికి శుక్రవారం ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎంపీటీసీ వంటాకు పైడితల్లమ్మ ఈ పనులను ప్రారంభించారు. ఎంపీటీసీ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ, మండల పరిషత్ నిధులతో ఈ ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు.