రేపు ఏటూరునాగారం ITDAలో ప్రజావాణి
MLG: ఏటూరునాగారం ITDAలో రేపు ప్రజావాణి, గిరివాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని ఈసారి ప్రత్యేకంగా ఏటూరునాగారం ITDAలో ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.