టెర్రర్ ఫండింగ్ అనుమానంతో ED దాడులు

టెర్రర్ ఫండింగ్ అనుమానంతో ED దాడులు

ఉగ్రవాదులకు నిధుల సరఫరాపై అనుమానంతో మహారాష్ట్ర థానేలో ED, ATS బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే పడ్గా ప్రాంతం భివండిలోని అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అనుమానించదగ్గ లావాదేవీలు చేసినవారిని ఈడీ విచారిస్తోంది. ఇప్పటివరకు 22 మంది ఇళ్లల్లో తనిఖీలు చేయగా, ATS 19 ఫోన్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.