గ్యాస్ సిలిండర్ల కోసం భారీగా క్యూ లైన్
TG: నిజామాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరారు. మరోవైపు పలు గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్‌లను బంద్ చేశారు. యుద్ధ ప్రభావంతో ముందుగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటళ్లు, టీ స్టాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ముందే బుక్ చేసినా సిలిండర్లు రావడం లేదని వినియోగదారులు మండిపడుతున్నారు.