VIDEO: పోస్టాఫిస్ తొలగించవద్దని స్థానికులు విజ్ఞప్తి

ప్రకాశం: దోర్నాల మండలం చిన్న గుడిపాడులో ఉన్న పోస్టాఫిస్‌ను తొలగించవద్దని స్థానికులు శనివారం విజ్ఞప్తి చేశారు. గత 80 సంవత్సరాలుగా కొనసాగుతున్న పోస్టాఫిస్‌లో 1,200 మంది ఆర్డి కస్టమర్లు ఉన్నారు. వారంతా 60 సంవత్సరాల పైబడి ఉండడంతో ఇక్కడ నుంచి పోస్టాఫిస్ తొలగిస్తే మేము ఎక్కడికని వెళ్లాలని పోస్టాఫిస్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలని వాపోయారు.