'ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి'
BHNG: ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. మోటకొండూర్ మండలం చాడలో నిర్వహించిన 'ప్రజాపాలన' కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీనివాస్తో కలిసి ఆయన టీబీ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్య పరీక్షలను, చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.