నేడు అరణియార్ చేప పిల్లల విడుదల
TPT: పిచ్చాటూరులోని అరణియార్ ప్రాజెక్టులో 10 లక్షల చేప పిల్లలను గురువారం విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అరణియార్ గేట్ల వద్దకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వస్తారని ఏఎంసీ మాజీ ఛైర్మన్ డి. ఇళంగోవన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం అధికారులు, మత్స్య కార్మికులతో కలిసి చేప పిల్లలు వదలనున్నారు.