నేడు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
NLR: ఉదయగిరి సర్కిల్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు సీఐ వెంకట్రావు, ఎస్సై ఇంద్రసేనా రెడ్డిలు తెలిపారు. దీంతో ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.