తాడిపత్రిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ATP: తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గాంధీ కట్ట వద్ద నుంచి నంద్యాల రోడ్డు వరకు ఉన్న ఓపెన్ డ్రైను మూసివేసి దాని స్థానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేసే పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణతో కలిసి పలు విషయాలపై చర్చించారు.