HYDలో వర్షాలు.. నీళ్లకు పరీక్షలు

HYDలో వర్షాలు.. నీళ్లకు పరీక్షలు

HYD: నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నల్లాల్లో సరఫరా అయ్యే నీరు ఎక్కడైనా కలుషితమవుతోందా? అని జలమండలి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు. బోర్డు పరిధిలో మొత్తం 14.19 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈనెలలో ఇప్పటి వరకు దాదాపు 1,28,376 నల్లాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని, వర్షాల నేపథ్యంలో ఎక్కువ నమూనాలు సేకరించామని అధికారులు తెలిపారు.