'ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి'

AKP: లోపూడి శివారు బంగారుమెట్టలో ఆక్రమణలో ఉన్న స్థలం స్వాధీనం చేసుకోవాలని మాజీ సర్పంచ్ సిరిగిరిశెట్టి నానాజీ విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం అనకాపల్లి ఆర్డీవో ఆయేషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించాలని వినతిపత్రం అందించారు. ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు.