సత్తెనపల్లిలో మెగా వైద్య శిబిరం ప్రారంభం
PLD: సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజావేదిక వద్ద మెగా వైద్య శిబిరాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ప్రజలు ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.