'తుఫానుపై అసత్య ప్రచారాలు నమ‍్మవద్దు'
VSP: విశాఖ జీవీఎంసీ పరిధిలో తుఫాను తీవ్రతపై అసత్య ప్రచారాలను, వదంతులను ప్రజలు నమ్మరాదని కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తున్నందున, ప్రజలు ఆందోళన చెందకుండా, అధికారుల సూచనలను పాటించాలని కమిషనర్ కోరారు.