'విద్యార్థులపై ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

KNR : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇంగ్లీషులో పట్టు సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ మంగళవారం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి సమావేశం నిర్వహించారు.