పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం కామారెడ్డి మండలంలోని అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ ఈ సందర్భంగా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా, సిబ్బంది పనితీరును పరిశీలించారు.