సైబర్ నేరాలపై సీపీ సాయి చైతన్య ఫోకస్!
NZB: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు సీపీ సాయిచైతన్య మంగళవారం 'ఫ్రాడ్ కా ఫుల్స్టాప్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం వరుసగా ఆరు వారాల పాటు జరగనుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత లక్ష్యంగా ఆన్‌లైన్ గేమ్స్ దుష్ప్రభావాలు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త రకం సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.