మడకశిరలో అంగన్వాడీలతో ఎమ్మెల్యే సమావేశం
సత్యసాయి: మడకశిరలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అన్నగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.